డ్ర‌గ్స్ కేసులో ఈడీ విచార‌ణ‌కు వ‌చ్చిన‌ సినీన‌టుడు రానా.. వీడియో ఇదిగో

  • కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా విచార‌ణ‌
  • బ్యాంకు ఖాతాల‌ను ప‌రిశీలిస్తోన్న అధికారులు
  • అనుమానాస్ప‌ద లావాదేవీల‌పై ప్ర‌శ్నలు
టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు సినీన‌టుడు రానాను విచారిస్తున్నారు. ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందును విచారించిన విష‌యం తెలిసిందే.

తాను కూడా నోటీసులు అందుకున్న నేప‌థ్యంలో ఈ రోజు ఈడీ అధికారుల ముందు రానా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. ప్రస్తుతం రానాను అధికారులు విచారిస్తున్నారు. ఆయ‌న‌కు సంబంధించిన‌ బ్యాంకు ఖాతాల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఆయ‌న గ‌తంలో జ‌రిపిన‌ అనుమానాస్ప‌ద లావాదేవీల‌పై ప్ర‌శ్నిస్తున్నారు. డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్ ను కూడా ఇప్ప‌టికే అధికారులు విచారించిన విష‌యం తెలిసిందే.

ఆయ‌న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారుల ముందు లొంగిపోవ‌డంతో అధికారులు ఆయ‌న నుంచి కీల‌క వివ‌రాలు రాబ‌ట్టారు. కెల్విన్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు ప‌లువురిని ప్ర‌శ్నిస్తున్నారు. కెల్విన్ సెల్‌ఫోన్‌లో ఉన్న ప‌లువురి ఫోన్ నంబ‌ర్లు, వారితో జ‌రిపిన వాట్సప్ చాటింగ్‌ను అధికారులు ప‌రిశీలించారు.


More Telugu News