ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎన్ఆర్ఎఫ్

  • తాత్కాలిక క్యాబినెట్ ను ప్రకటించిన తాలిబన్లు
  • ప్రకటన విడుదల చేసిన ఎన్ఆర్ఎఫ్
  • ఈ క్యాబినెట్ ఏర్పాటు చట్టవిరుద్ధమని విమర్శలు
  • భావి ప్రభుత్వంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని పంజ్ షీర్ లోయ నుంచి పోరాటం సాగిస్తున్న జాతీయ ప్రతిఘటన కూటమి (ఎన్ఆర్ఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన ఆపద్ధర్మ క్యాబినెట్ ను చట్టవిరుద్ధమని పేర్కొంది. ఆఫ్ఘన్ ప్రజలతో తాలిబన్లకున్న వైరానికి ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఓ సంకేతమని అభివర్ణించింది. ఓటు ద్వారా ప్రజాభీష్టం మేరకు ఎన్నుకున్న ప్రభుత్వమే న్యాయ సమ్మతమని, అంతర్జాతీయ సమాజం కూడా అదే కోరుకుంటుందని వివరించింది.

తాలిబన్లు, వారి ఉగ్రవాద మిత్రులకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించాలని ఎన్ఆర్ఎఫ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ఘన్ ముఖ్య నాయకులు, విధానకర్తలతో చర్చించి భావి ప్రభుత్వంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.


More Telugu News