చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదంటూ ప్రచారం.. యూట్యూబర్ అరెస్ట్
- యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
- చింతలపూడిలో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ
- ఆపై వీడియో చేసి యూట్యూబ్‌లో పోస్టు
- వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన పోలీసులు
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల రాకాడ ఎలీజా కనిపించడం లేదంటూ యూట్యూబ్‌లో ప్రచారం చేసిన యూట్యూబర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన కిరణ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ఓ యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. ప్రజల అభిప్రాయ సేకరణ కోసం గత నెలలో చింతలపూడిలో పర్యటించారు. అనంతరం ఓ వీడియో చేసి తన చానల్‌లో పోస్టు చేశారు.
ఎమ్మెల్యే కనిపించడం లేదని, నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు గోడు వెళ్లబోసుకుంటున్నారంటూ ఆగస్టు 5న పోస్టు చేసిన వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోపై వైసీపీ నేతలు అదే నెల 16న చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం కిరణ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఆ తర్వాత స్టేషన్ బెయిలుపై విడుదల చేయాలన్న న్యాయమూర్తి సూచన మేరకు ఆయనను నిన్న విడుదల చేశారు.