ఆఫ్ఘనిస్థాన్‌లో కొంతమంది అమెరికన్లను గుర్తించాం: యూఎస్
- వెల్లడించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్
- ఆఫ్ఘన్‌లోని మజర్-ఐ-షరీఫ్‌లో అమెరికన్లు
- దోహాలో జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బ్లింకెన్
తాలిబన్ల వశమైనప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 31తో అమెరికా సైన్యం పూర్తిగా ఆఫ్ఘన్ గడ్డను వీడింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల హస్తగతమైంది. ఈ నేపథ్యంలో ఇంకా కొందరు అమెరికన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు తాము గుర్తించామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ తెలిపారు. తమను అమెరికా తీసుకెళ్లాలని వారు కోరుతున్నట్లు ఆయన చెప్పారు.
ఆఫ్ఘన్‌లోని మజర్-ఐ-షరీఫ్ ప్రాంతం నుంచి తమను తరలించాలని ఈ అమెరికా పౌరులు కోరుతున్నారని తెలుస్తోంది. ఖతార్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంలో బ్లింకెన్ పాల్గొన్నారు. దోహాలో ఖతార్ నేతలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లింకెన్ ఈ విషయాలు వెల్లడించారు. చాలా మంది ఆఫ్ఘన్ పౌరులు కూడా అమెరికా వచ్చేయాలని అనుకుంటున్నారని, కానీ దురదృష్టవశాత్తు వారి వద్ద సరైన ధ్రువ పత్రాలు లేవని ఆయన తెలిపారు.