చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్నవాళ్లు దేశం నుంచి వెళ్లిపోవచ్చు: తాలిబన్లు 

  • ఆఫ్ఘన్ ను వీడేందుకు సిద్ధంగా ఉన్న వేలమంది
  • సరైన పత్రాలు ఉంటే తమకు అభ్యంతరం లేదన్న తాలిబన్లు
  • ఓ ప్రకటనలో వెల్లడించిన తాలిబన్లు
  • తాలిబన్లను ఉటంకించిన అమెరికా మంత్రి
ఆఫ్ఘనిస్థాన్ ను వీడి ఇతర దేశాలకు వెళ్లిపోవాలని కోరుకుంటున్న వారికి తాలిబన్లు శుభవార్త చెప్పారు. చెల్లుబాటు అయ్యే వీసాలు, పాస్ పోర్టులు ఉన్నవాళ్లు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని వెల్లడించారు. మజారే షరీఫ్ నగరంలో చిక్కుకుపోయిన వారిలో సరైన వీసాలు, పాస్ పోర్టులు ఉన్నవారిని తరలింపు విమానాల్లో ఎక్కేందుకు అనుమతిస్తున్నామని తాలిబన్ల అధికార ప్రతినిధి మలావీ హఫీజ్ మన్సూర్ ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే, దేశం విడిచి వెళ్లాలనుకుంటున్న చాలామంది ఆఫ్ఘన్ల వద్ద సరైన పత్రాలు లేవని అన్నారు. సక్రమమైన పత్రాలు ఉన్నవారిని తాము అడ్డుకోబోమని స్పష్టం చేశారు. అటు అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఖతార్ లో మాట్లాడుతూ, సరైన పత్రాలు కలిగి ఉండి ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోవాలనుకునే వారికి పూర్తిగా సహకరిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చారని వెల్లడించారు.


More Telugu News