రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ
- కరోనా వల్ల ఏప్రిల్ లో టోకెన్ల జారీ నిలిపివేత
- తాజాగా పునరుద్ధరణ
- ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు అవకాశం
- రోజుకు 2 వేల టోకెన్లు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రేపటి నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రోజుకు 2 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు అవకాశం కల్పించనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ వెల్లడించింది.
తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్లలో ఈ టోకెన్లు ఇస్తామని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 11 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ వర్గాలు నిలిపివేశాయి. కరోనా కేసులు తగ్గుతుండడంతో పునరుద్ధరించారు.