కర్నూలు జిల్లాలో తన్నుకున్న సీఐ, లాయర్
- డోన్ పోలీస్ స్టేషన్ లో ఘటన
- సీఐ, లాయర్ మధ్య వాగ్వాదం
- పోలీసులంతా కలిసి మరోసారి లాయర్ పై దాడి
కర్నూలు జిల్లా డోన్ లో చోటుచేసుకున్న ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ, లాయర్ ఇద్దరూ పరస్పరం కొట్టుకున్నారు. ఇంటి దగ్గర వివాదానికి సంబంధించి పోలీస్ స్టేషన్ కు ఇద్దరు లాయర్లు వచ్చారు. అయితే వివాదాన్ని సీఐకి వివరించే క్రమంలో... సీఐకి, లాయర్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కాస్తా ముదిరి ఇద్దరూ ఒకరిపై మరొకరు దాడికి దిగారు. ఆ తర్వాత పీఎస్ నుంచి బయటకు వచ్చిన లాయర్ పై పోలీసులంతా కలిసి మరోసారి దాడి చేశారు. ఈ ఘటన పట్ల న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.