తెలంగాణకు వస్తున్న అమిత్ షా.. పాదయాత్ర కు బ్రేక్ ఇవ్వనున్న బండి సంజయ్
- ఈ నెల 17న తెలంగాణకు విచ్చేస్తున్న అమిత్ షా
- తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న అమిత్ షా
- కామారెడ్డిలో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్న బండి సంజయ్
తెలంగాణలో బలపడేందుకు బీజేపీ కార్యాచరణను ముమ్మరం చేస్తోంది. ఈ నెల 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయత్రకు బ్రేక్ పడబోతోంది.
సంజయ్ పాదయాత్ర ఇప్పటికే 100 కిలోమీటర్లు దాటింది. ఈ నెల 17వ తేదీ నాటికి ఆయన పాదయాత్ర కామారెడ్డికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో పాదయాత్రకు ఆయన బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం నిర్మల్ లో జరిగే తెలంగాణ విమోచన సభకు వెళ్లనున్నారు.
మరోవైపు నిర్మల్ పట్టణంలోని వెయ్యి ఊడల మర్రి దగ్గర బహిరంగసభను నిర్వహించే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు సమాచారం. అమిత్ షా పర్యటన సందర్భంగా పాదయాత్ర విశేషాలను ఆయనకు బండి సంజయ్ వివరించనున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికపై కూడా చర్చించనున్నారు.