ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. వెంటనే ఆదుకోండి: అధికారులను కోరిన బండి సంజయ్
- వానలు, వరద పరిస్థితిపై ఆందోళన
- కరీంనగర్, సిరిసిల్ల ముంపుపై ఆవేదన
- వెంటనే రంగంలోకి దిగాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపు
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వరదలకు ఇండ్లు మునిగిపోయి ఆస్తి నష్టం జరగడం విచారకరమన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, సిరిసిల్ల పట్టణంలో ముంపునకు గురైన కాలనీలు, బస్తీల పరిస్థితి గురించి ఆయన ఆరా తీశారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ లు, ఇతర అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. బాధితులకు తక్షణమే సాయం అందించాలని కోరారు. వరదలు, వానలతో ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.