రోడ్ల దుస్థితిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పంద‌న‌ను ఆహ్వానిస్తున్నా: ర‌ఘురామ‌కృష్ణ రాజు

  • రోడ్ల‌పై ఉన్న గోతుల‌కు సంబంధించిన ఫొటోలు తీయాల‌న్నారు
  • సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయాల‌ని పవన్ చెప్పారు
  • ఈ ప్ర‌భుత్వ నేత‌లు మారాల‌ని, మారుతార‌ని ఆశిస్తున్నాను
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చుట్టూ ఉండేవారు ఆయ‌న‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి చెప్ప‌ట్లేదని, జ‌గ‌న్‌ను పొగ‌డ‌డానికే ప‌రిమితం అయ్యార‌ని వైసీపీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు అన్నారు. ఈ రోజు ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ర‌హ‌దారుల స‌మ‌స్య‌ల‌పై నిన్న సీఎం జ‌గ‌న్ జ‌రిపిన రివ్యూను ఆహ్వానిస్తున్నానని, అయితే, ర‌హ‌దారుల‌పై సీఎం రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాదని ఆయ‌న అన్నారు. గ‌త ప్రభుత్వం వ‌ల్లే రోడ్లన్నీ గుంత‌లమ‌యంగా ఉన్నాయని అన‌డం ఏంటీ? అని ఆయ‌న ప్రశ్నించారు. హెలికాప్ట‌ర్లో కాకుండా రోడ్ల‌పై తిర‌గాల‌ని జ‌గ‌న్‌ను కోరుతున్నాన‌ని చెప్పారు.

రోడ్ల దుస్థితిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పంద‌న‌ను ఆహ్వానిస్తున్నాన‌ని ర‌ఘురామ అన్నారు. తాము కూడా ముందు నుంచి రోడ్ల ప‌రిస్థితి గురించి మాట్లాడుతున్నామ‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సైనికుల‌తో రోడ్ల‌పై ఉన్న గోతుల‌కు సంబంధించిన ఫొటోలు తీసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయాల‌ని చెప్పారని, జ‌న సైనికులు ఆ ప‌నిచేస్తున్నారని చెప్పారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం రోడ్ల‌ను బాగు చేయిస్తే నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గానీ, నేనుగానీ, చంద్ర‌బాబు నాయుడు గానీ ప్ర‌భుత్వానికి చెప్పాల్సిన అవ‌స‌రం ఉండేది కాదని ర‌ఘురామ అన్నారు. ఈ ప్ర‌భుత్వ నేత‌లు మారాల‌ని, మారుతార‌ని ఆశిస్తున్నానని చెప్పారు. అలాగే, ఒక్క దేవాల‌యానికే క‌రోనా నిబంధ‌న‌లా? అని ర‌ఘురామ ప్ర‌శ్నించారు. మ‌ద్యం దుకాణాలు ఎల్ల‌ప్పుడూ తెరిచే ఉంటున్నాయని, మ‌రి హిందువులు పండుగ‌లు జ‌రుపుకోకుండా ఆక్ష‌లు ఎందుక‌ని ఆయ‌న అడిగారు.  


More Telugu News