భారీ వర్షాలపై కేసీఆర్.. సిరిసిల్ల వర్ష బీభత్సంపై కేటీఆర్ సమీక్షలు!

  • తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
  • ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
  • జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక పట్టణాలు, ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ వర్షాలు, వరదలపై అక్కడి నుంచే సమీక్ష నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, వివిధ శాఖల అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు.

సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అధికారులంతా 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

మరోవైపు కుండపోత వర్షాలతో సిరిసిల్ల పట్టణానికి వరద పోటెత్తింది. పట్టణం నిండు చెరువును తలపించింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్ లతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరదనీరు పలు కాలనీల్లోకి వచ్చి చేరుతోందని... సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


More Telugu News