టెలివిజన్ షో ‘ది వైర్’ ఫేమ్ మైఖేల్ విలియమ్స్ మృతి
- ‘ది వైర్’ సిరీస్‌తో పాప్యులర్ అయిన విలియమ్స్
- ‘లవ్‌క్రాఫ్ట్ కంట్రీ’ సిరీస్‌లో నటనకు గాను ఎమ్మీ ఉత్తమ నటుడి అవార్డుకు నామినేషన్
- విలియమ్స్‌కు వేలాదిమంది అభిమానులు
- మాదక ద్రవ్యాలు అధికంగా తీసుకోవడం వల్లే మృతి?
అమెరికాకు చెందిన ప్రముఖ టెలివిజన్ నటుడు మైఖేల్ కె విలియమ్స్ మృతి చెందాడు. ఆయన వయసు 54 సంవత్సరాలు. ‘ది వైర్’ సిరీస్‌తో విశేష ప్రాచుర్యం పొందిన మైఖేల్ న్యూయార్క్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు విగత జీవిగా కనిపించాడు. అతడి మృతిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బహుశా మాదక ద్రవ్యాలను అధికంగా తీసుకోవడం వల్లే మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు.
2002-2008 మధ్య ‘హెచ్‌బీవో’లో ప్రసారమైన ‘ది వైర్’ సిరీస్ వేలాదిమందిని ఆకట్టుకుంది. అందులో ఆయన డ్రగ్ డీలర్ పాత్ర పోషించారు. అలాగే ‘బోర్డువాక్ ఎంపైర్’ సిరీస్‌లోనూ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘లవ్‌క్రాఫ్ట్ కంట్రీ’ సిరీస్‌లో విలియమ్స్ నటనకు గాను 2021 ఉత్తమ నటుడి అవార్డుకు నామినేట్ అయ్యారు.