బిజినెస్ క్లాస్ లో చీమలు.. చివరి నిమిషంలో విమానం మార్పు!
- ఎయిరిండియా విమానం బిజినెస్ తరగతిలో కనిపించిన చీమలు
- ప్రయాణికుల్లో భూటాన్ యువరాజు
- లండన్ వెళ్లాల్సిన విమానం
దేశ రాజధాని ఢిల్లీ నుంచి లండన్ వెళ్లాల్సిన ఒక విమానాన్ని ఎయిరిండియా చివరి నిమిషంలో ఆపేసింది. ఆ తర్వాత దాని స్థానంలో మరో విమానాన్ని ఉపయోగించింది. ఈ ఘటన సోమవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. విమానంలోని బిజినెస్ తరగతి విభాగంలో చీమలు కనిపించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రయాణికుల్లో భూటాన్ యువరాజు జిగ్మే నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్ కూడా ఉన్నారట. ప్రయాణం ప్రారంభించే ముందు బిజినెస్ క్లాస్ సీట్ల వద్ద చీమలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
జులై నెలలో ప్రయాణం మధ్యలో ఉండగా ఒక ఎయిరిండియా విమానం విండ్‌షీల్డ్‌లో చీలిక కనిపించింది. ఆ విమానంలో కార్గో, క్రూ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ప్రయాణం ప్రారంభించిన గంట తర్వాతగానీ ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. ఆ వెంటనే విమానాన్ని కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.