వైసీపీ నేతల ధనదాహానికి వ్యవస్థలు కూలుతున్నాయి: సోమిరెడ్డి
- నెల్లూరు జిల్లా వైసీపీ నేతలపై ధ్వజమెత్తిన సోమిరెడ్డి
- ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయని ఆరోపణ
- ఫిర్యాదు చేసినా స్పందనలేదని వెల్లడి
- భూములు, ఆస్తులు కాజేస్తున్నారని ఆగ్రహం
వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతల ధనదాహానికి వ్యవస్థలు కూలుతున్నాయని వ్యాఖ్యానించారు. సర్వేపల్లిలో ప్రభుత్వ భూమి మాయం అవుతోందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, అధికారులకు తెలియకుండానే ఈ తతంగం జరుగుతోందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి, ప్రజల ఆస్తులను కాజేసే పరిస్థితికి తెచ్చారని విమర్శించారు.
చిల్లకూరులో ఇప్పటికే 250 ఎకరాల ప్రభుత్వ భూమి ధారాదత్తం చేశారని, కాకుటూరులో రూ.60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి మాయం అయిందని సోమిరెడ్డి వివరించారు. ఈ వ్యవహారాలపై ఆగస్టు 4న ఫిర్యాదు చేసినా ఇప్పటికీ కేసు నమోదు కాలేదని ఆరోపించారు. తహసీల్దార్ ఫిర్యాదు చేసినా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.