అనూహ్యరీతిలో కుప్పకూలిన ఇంగ్లండ్ టాపార్డర్... గెలుపు బాటలో టీమిండియా
- 100 పరుగుల వరకు సజావుగా ఆడిన ఇంగ్లండ్
- 47 పరుగుల తేడాతో 6 వికెట్లు డౌన్
- ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 6 వికెట్లకు 149 రన్స్
- రాణించిన టీమిండియా బౌలర్లు
నాలుగో టెస్టులో టీమిండియా గెలుపు బాటలో పయనిస్తోంది. 368 పరుగుల లక్ష్యఛేదనలో 100 పరుగుల వరకు ఒక్క వికెట్టు కూడా కోల్పోని ఇంగ్లండ్ ఆ తర్వాత అనూహ్యరీతిలో తడబాటుకు గురైంది. కేవలం 47 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు చేజార్చుకుంది. శార్దూల్ ఠాకూర్ ఇంగ్లండ్ పతనానికి శ్రీకారం చుట్టగా... జడేజా, బుమ్రా చెరో రెండు వికెట్లు తీసి మరింత దెబ్బతీశారు.
ఓపెనర్లు రోరీ బర్న్స్ 50, హసీబ్ హమీద్ 63 పరుగులు చేశారు. డేవిడ్ మలాన్ 5, ఓల్లీ పోప్ 2, బెయిర్ స్టో 0, మొయిన్ అలీ 0 పరుగులు మాత్రమే చేశారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 68 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు కాగా, ఆ జట్టు గెలవాలంటే ఇంకా 219 పరుగులు చేయాలి. చేతిలో 4 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం కెప్టెన్ జో రూట్ 18 పరుగులతోనూ, క్రిస్ వోక్స్ 2 పరుగులతోనూ ఆడుతున్నారు.