బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లికి తీవ్ర అస్వస్థత
- అరుణా భాటియాకు అనారోగ్యం
- ముంబయిలోని హీరానందిని ఆసుపత్రికి తరలింపు
- ఐసీయూలో చికిత్స
- లండన్ లో షూటింగ్ లో ఉన్న అక్షయ్
- హుటాహుటీన ముంబయి చేరిక
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ఆసుపత్రి పాలయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ముంబయిలోని హీరానందిని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా, తల్లి ఆసుపత్రిలో చేరిందన్న వార్తతో అక్షయ్ కుమార్ హుటాహుటీన లండన్ నుంచి బయలుదేరి ముంబయి చేరుకున్నారు.
అక్షయ్ లండన్ లో తన కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే తాను ముంబయి వెళ్లిపోతున్నప్పటికీ, షూటింగ్ కొనసాగించాలని అక్షయ్ కుమార్ నిర్మాతలకు సూచించారు. ఇతర సన్నివేశాలను చిత్రీకరించాలని తెలిపారు.