మరో గంటలో హైదరాబాదులో భారీ వర్షం... వాతావరణ కేంద్రం హెచ్చరిక
- ఇప్పటికే వర్షాలతో సతమతమవుతున్న హైదరాబాద్
- ఈ ఉదయం నుంచి కురుస్తున్న వాన
- కాసేపట్లో భారీ వర్షం పడనుందన్న అధికారులు
- ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని స్పష్టీకరణ
హైదరాబాదు నగరాన్ని భారీ వర్షాలు వీడడంలేదు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైన భాగ్యనగరంలో మరో గంటలో భారీ వర్షం పడనుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. తాజా హెచ్చరిక నేపథ్యంలో జీహెచ్ఎంసీ స్పందించింది. ఈ సాయంత్రం ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, సాధ్యమైనంత వరకు ఎవరూ బయటికి రావొద్దని స్పష్టం చేసింది.
అవసరమైన వారు 040 29555500 నెంబరుకు ఫోన్ చేయాలని సూచించింది. ఇక ఉదయం నుంచి కురుస్తున్న సాధారణ వర్షం ఈ రాత్రి కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అవసరమైన వారు 040 29555500 నెంబరుకు ఫోన్ చేయాలని సూచించింది. ఇక ఉదయం నుంచి కురుస్తున్న సాధారణ వర్షం ఈ రాత్రి కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.