ఆర్టీపీసీఆర్ టెస్టులోనూ రవిశాస్త్రికి పాజిటివ్
- నిన్న రవిశాస్త్రికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు
- కరోనా పాజిటివ్ గా వచ్చిన వైనం
- దాంతో శాస్త్రికి ఆర్టీపీసీఆర్ టెస్టు
- శాస్త్రితో పాటు మరో ఇద్దరికి పాజిటివ్
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి నిన్న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో కరోనా పాజిటివ్ రావడం తెలిసిందే. దాంతో ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్టు కూడా నిర్వహించారు. తాజాగా ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితం వచ్చింది. ఆందులోనూ రవిశాస్త్రికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ లకు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా, వారిద్దరూ కరోనా పాజిటివ్ గా తేలారు. దాంతో ఈ ముగ్గురు చివరి టెస్టుకు వేదికైన మాంచెస్టర్ కు వెళ్లబోవడంలేదని మేనేజ్ మెంట్ వర్గాలు తెలిపాయి. వారు లండన్ లోనే మరో 10 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నారు. టీమిండియా, ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదో టెస్టు మాంచెస్టర్ వేదికగా ఈ నెల 10న ప్రారంభం కానుంది.