వరుసగా ఏడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 167 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 54 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2.67 పాయింట్లు పెరిగిన హెచ్సీఎల్ షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఏడో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి దిగ్గజ కంపెనీల అండతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ ఒకానొక సమయంలో 386 పాయింట్ల వరకు పెరిగింది. అయితే, చివరికి ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 167 పాయింట్లు లాభపడి 58,297కి చేరుకుంది. నిఫ్టీ 54 పాయింట్లు పెరిగి 17,378కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.67%), ఇన్ఫోసిస్ (1.78%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.62%), టెక్ మహీంద్రా (0.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.73%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.13%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.86%), ఐటీసీ (-0.66%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.64%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.63%).