ఇంటర్ ప్రవేశాలు ఆన్ లైన్లో వద్దు: ఏపీ హైకోర్టు ఆదేశాలు

  • ఇంటర్ లో ఆన్ లైన్ అడ్మిషన్లకు సర్కారు ప్రకటన
  • హైకోర్టులో పిటిషన్లు
  • గత నెల 26న తీర్పును రిజర్వ్ లో ఉంచిన కోర్టు
  • గతంలో మాదిరే ప్రవేశాలు చేపట్టాలని తాజాగా తీర్పు
ఏపీలో ఈసారి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆన్ లైన్ విధానంలో చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లు వద్దంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇంటర్ లో ప్రవేశాలను గతంలో మాదిరే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆన్ లైన్ అడ్మిషన్లపై ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది.

గత నెల 26న ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరగ్గా, వాదనలు పూర్తిస్థాయిలో విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఆన్ లైన్ అడ్మిషన్లకు స్పష్టమైన విధివిధానాలు లేవని పిటిషనర్లు వాదనలు వినిపించారు. సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి తదితరులు ఆన్ లైన్ అడ్మిషన్ల అంశంలో హైకోర్టును ఆశ్రయించారు.


More Telugu News