ఆఫ్రికా దేశంలో సైనిక తిరుగుబాటు.. సైన్యం నిర్బంధంలో అధ్యక్షుడు
- గినియా దేశంలో సైనిక తిరుగుబాటు
- రాజ్యాంగాన్ని రద్దు చేసినట్టు ప్రకటించిన సైన్యం
- సైనిక తిరుగుబాటుని తప్పుపట్టిన అమెరికా
ఆఫ్రికాలోని గినియా దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది. గినియా దేశాధ్యక్షుడు అల్ఫా కోంటేని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. ప్రజారంజకమైన పాలనను అందిస్తామని చెప్పారు. ఈరోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు సైనిక తిరుగుబాటుని అమెరికా తప్పుపట్టింది. ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధమని వ్యాఖ్యానించింది.