మానసిక క్షోభ భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది వృద్ధులు మృతి: లోకేశ్‌

  • పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్నారు
  • రూ.3 వేల పెన్షన్ ఇస్తానని ఆశపెట్టి మాట మార్చారు
  • అడ్డమైన కారణాలు చెబుతూ భారీగా పెన్షన్ల కోత
  • గత రెండు నెలల్లోనే 2.30 లక్షల పెన్షన్లు లేపేశారు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వృద్ధుల‌కు పెన్ష‌న్లు అంద‌కుండాపోతుండ‌డంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

'పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న వైఎస్ జ‌గ‌న్ తుంచుకుంటూ పోతున్నారు. రూ.3 వేల పెన్షన్ ఇస్తానని ఆశపెట్టి మాట మార్చారు, మడమ తిప్పారు. 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తానని డాబు కబుర్లు చెప్పి అడ్డమైన కారణాలు చెబుతూ భారీగా పెన్షన్లు కోతపెడుతున్నారు' అని లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు.

'గత రెండు నెలల్లోనే 2.30 లక్షల పెన్షన్లు లేపేసి అవ్వా తాతలకు తీరని అన్యాయం చేశారు. మీరు పెడుతున్న మానసిక క్షోభ భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనే ఆధారంగా బతుకుతున్న 13 మంది వృద్ధులు మృతి చెందారు' అని ఆయ‌న ట్వీట్ చేశారు.

'మీరిచ్చిన హామీ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు రూ.2,750 పెన్షన్ ఇవ్వాలి. ప్రతి అవ్వా తాత దగ్గరా నెలకు రూ.500 కొట్టేస్తున్నదేకాక భారీగా పెన్షన్లు కోసేస్తున్న పాపం వూరికేపోదు వైఎస్ జ‌గ‌న్' అని లోకేశ్ హెచ్చ‌రించారు.

'ఆరోగ్య సమస్యలు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే వారి పెన్షన్లు తీసేయడం సబబు కాదు. ఎత్తేసిన పెన్షన్లు అన్నీ వెంటనే ఇవ్వాలి' అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.


More Telugu News