కేసీఆర్ గారు తన ఎజెండాను 100 శాతం అమలు చేస్తున్నారు: ష‌ర్మిల

  • చదువు చెప్పేటోడు లేకుంటే చదువుకునేటోడు ఉండడు
  • చదువులేకపోతే ప్రశ్నించేటోడు ఉండ‌డు,
  • కొలువులు అడిగేటోడు ఉండడు
  • విజ్ఞానాన్ని దూరం చేస్తున్నారు  
తెలంగాణ‌లోని విశ్వ‌విద్యాల‌యాల్లో ప్రొఫెస‌ర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని, వాటి భ‌ర్తీ అంశాన్ని ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను వైఎస్సార్ టీపీ అధ్య‌క్షురాలు వైఎస్‌ ష‌ర్మిల‌ పోస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

'చదువు చెప్పేటోడు లేకుంటే చదువుకునేటోడు ఉండడని, చదువులేకపోతే ప్రశ్నించేటోడు ఉండడని, కొలువులు అడిగేటోడు ఉండడని, బడులు బంద్ పెట్టి.. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను నియమించకుండా విజ్ఞానాన్ని దూరం చేస్తూ కేసీఆర్ గారు తన ఎజెండాను 100 శాతం అమలు చేస్తున్నారు' అని ష‌ర్మిల ఆరోపించారు.  

'రాష్ట్రంలో  మొత్తం 11లో 7 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు  100కు 100% లేరు. ఒక్క ఉస్మానియా తప్పితే మిగిలిన వాటిలో 90% బోధన సిబ్బంది ఖాళీనే. యూనివర్సిటీల్లో 2,837 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటే, 1,867 పోస్టులను భర్తీ చేయకుండా విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడు కేసీఆర్ సారు' అని ష‌ర్మిల విమ‌ర్శించారు.




More Telugu News