కరోనా పరిస్థితుల వల్ల పెరిగిన మధుమేహ ముప్పు
- లాక్‌డౌన్ కారణంగా బరువు పెరిగిన ప్రజలు
- మరింత మందికి టైప్-2 మధుమేహ ముప్పు
- బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ అధ్యయనం
- మరిన్ని వ్యాధులూ వచ్చే అవకాశం
ప్రపంచ వ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతోన్న వారు ఇప్పటికే కోట్లాది మంది ఉన్నారు. దానికితోడు కరోనా లాక్‌డౌన్ కారణంగా మరింత మందికి టైప్-2 మధుమేహ ముప్పు పెరిగిందని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) నిర్వహించిన పరిశోధనలో తేలింది.
లాక్‌డౌన్ కారణంగా చాలా మంది బరువు పెరిగారని, ఈ కారణంగా టైప్-2 మధుమేహం ముప్పు పెరిగిందని పరిశోధకులు వివరించారు. ఈ పరిశోధన ఫలితాలను ‘ద లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ’లో ప్రచురించారు.
పరిశోధనలో భాగంగా 40 ఏళ్లలోపు వారి డేటాను పరిశోధకులు అధ్యయనం చేశారు. మూడేళ్ల ముందు కూడా ఇటువంటి పరిశోధన చేశారు. దానితో పోల్చి చూస్తే తాజా అధ్యయనంలో పాల్గొన్న వారి బరువు సరాసరి 3.6 కిలోల మేర పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.
శరీర బరువు కిలో పెరిగినా మధుమేహం ముప్పు 8 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. కరోనా వల్ల ఎన్నో అలవాట్లు మారాయని, మన శరీరం, మనసుపై పెను ప్రభావం పడిందని చెప్పారు. బరువు పెరగడం వల్ల కేన్సర్, అంధత్వం, గుండె పోటు, పక్షవాతం వంటి వాటి ముప్పు కూడా పెరిగిందని తెలిపారు.
జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని వివరించారు. ఊబకాయం అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుందని, అది 80-85 శాతం మేర డయాబెటిస్‌కు చేరువ చేస్తుందని పరిశోధకులు చెప్పారు.