ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధంలో నా గొంతు మూగబోతోంది: ఎస్పీబీని గుర్తుచేసుకుంటూ సునీత భావోద్వేగం
- మావయ్యా .. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది
- నీ పాట వినాలనుంది
- చెమర్చిన కళ్లతో చప్పట్లు కొట్టాలనుంది
'మావయ్యా .. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది' అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని సింగర్ సునీత గుర్తు చేసుకున్నారు. ఎస్పీబీ కన్నుమూసి ఏడాది కావస్తున్న నేపథ్యంలో సునీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ఆయన పాడుతుంటే మళ్లీ మళ్లీ చెమర్చిన కళ్లతో చప్పట్లు కొట్టాలనుందని పేర్కొంది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధంలో తన గొంతు మూగబోతోందని తెలిపింది.
సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా ఉందని చెప్పింది. ఎప్పటికీ బాల సుబ్రహ్మణ్యమే తన గురువు, ప్రేరణ, ధైర్యం, బలం, నమ్మకం అని ఆమె పేర్కొంది. బాల సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా అందర్నీ ఎప్పటిలాగే ఆప్యాయతతో చూసుకుంటాడన్న నమ్మకం ఉందని ఆమె చెప్పింది. ఆ నమ్మకంతోనే తాను కూడా బతికేస్తున్నానని తెలిపింది. గతంలో బాలసుబ్రహ్మణ్యంతో దిగిన ఫొటోను ఆమె ఈ సందర్భంగా పోస్ట్ చేసింది.