మధుమేహం సహా పలు రకాల మందుల ధరలు తగ్గింపు.. రోగులకు ఉపశమనం

  • మొత్తం 39 రకాల ఔషధాల ధరలు తగ్గించాలని నిర్ణయం
  • మరో 16 రకాల ఔషధాలు ఎన్ఎల్ఈఎం జాబితా నుంచి తొలగింపు
  • జాబితాలో చేర్చే ఔషధాల ధరలను నిర్ణయించనున్న ఎన్‌పీపీఏ
మధుమేహం, టీబీ, కేన్సర్ వంటి వాటితో బాధపడుతున్న వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ వ్యాధుల నివారణలో ఉపయోగించే 39 రకాల మందులు, టీకాల ధరలను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ అత్యవసర ఔషధాల జాబితా (ఎన్ఎల్ఈఎం)ను సవరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ జాబితాలో చేర్చే మందుల ధరలను ఎంతకు నిర్ణయించాలన్న విషయాన్ని జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) నిర్ణయించనుంది.

మొత్తం 39 రకాల ఔషధాలను ఎన్ఎల్ఈఎంలో చేర్చనున్న ప్రభుత్వం.. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నివారణకు ఉపయోగించే ఎరిత్రోమైసిన్, బ్లీచింగ్ పౌడర్, ఎయిడ్స్ మందులు వంటి 16 రకాల ఔషధాలను తొలగించాలని కూడా ప్రతిపాదించింది. ఈ మందులకు ప్రత్యామ్నాయంగా మెరుగైన మందులు రావడం, మరికొన్ని అసలు వాడుకలోనే లేకపోవడంతో జాబితా నుంచి వీటిని తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.


More Telugu News