మహిళా సామాజిక కార్యకర్తను చితకబాదిన తాలిబన్లు

  • కాబూల్ లో మహిళల నిరసనలు
  • అడ్డుకున్న తాలిబన్లు
  • మహిళ అని చూడకుండా సామాజిక కార్యకర్తపై దాడి
  • గాయాలతో కనిపించిన మహిళ
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ చర్యలతో రాక్షస గిరిజన జాతిగా పేరుగాంచిన తాలిబన్లు ఓ మహిళా సామాజిక కార్యకర్తపై విచక్షణ రహితంగా దాడి చేశారు. గాయాలపాలైన ఆ మహిళ తాజాగా ఓ వీడియోలో దర్శనమిచ్చింది. ముఖంపై రక్తమోడుతున్న గాయాలతో కనిపించింది. ఆమె పేరు నర్గీస్ సద్దాత్. ఇతర మహిళల హక్కుల కార్యకర్తలతో కలిసి కాబూల్ లో నిరసన చేపట్టిన సమయంలో తాలిబన్లు తనపై దాడి చేశారని నర్గీస్ వెల్లడించింది.

అటు, టోలో న్యూస్ కూడా ఈ అంశంపై స్పందించింది. కాబూల్ లో నిరసనకారులు దేశాధ్యక్ష భవనం దిశగా కదులుతుండడంతో తాలిబన్లు అడ్డుకున్నారని, వారిపై బాష్పవాయువు ప్రయోగించారని వెల్లడించింది. నేడు జరిగిన ఈ నిరసనలను నిలువరించేందుకు ఓ దశలో తాలిబన్లు తుపాకీలకు పనిచెప్పినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆఫ్ఘన్ మహిళలు తరచుగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.


More Telugu News