వెన్నుపోటు పొడవద్దు: కోమటిరెడ్డిపై మధుయాష్కీ ఫైర్

వెన్నుపోటు పొడవద్దు: కోమటిరెడ్డిపై మధుయాష్కీ ఫైర్
  • విజయమ్మ నిర్వహించిన సమ్మేళనంకు వెళ్లడాన్ని తప్పుబట్టిన మధుయాష్కీ
  • విజయమ్మ వ్యాఖ్యలను కోమటిరెడ్డి సమర్థిస్తారా? అని ప్రశ్న
  • సీతక్కపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ మండిపడ్డారు. వైయస్ విజయమ్మ నిర్వహించిన సమ్మేళనంకు కోమటిరెడ్డి వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. కోమటిరెడ్డి ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియగాంధీ కారణమని చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని కాదని సమ్మేళనంకు వెళ్లడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే పోవచ్చని... కానీ, పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయవద్దని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా విజయమ్మ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. సంస్కారం లేని వాళ్లే ఇలా మాట్లాడతారని అన్నారు.


More Telugu News