జగన్ అక్రమాస్తుల కేసు.. డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు గడువు కోరిన సీబీఐ

  • డిశ్చార్జ్ పిటిషన్లపై నిన్న ప్రత్యేక కోర్టులో విచారణ
  • 13న విచారణకు సిద్ధం కావాలని వైవీ సుబ్బారెడ్డికి కోర్టు ఆదేశం
  • విచారణకు హాజరు కాని శ్యాంప్రసాద్‌రెడ్డి, ‘ఇందూ’ ప్రతినిధులు
లేపాక్షి, ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ ప్రాజెక్టుల కేసుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు ఎదుర్కొంటున్న అభియోగాలపై సీబీఐ ప్రత్యేక కోర్టులో నిన్న విచారణ జరిగింది. జగన్, విజయసాయిరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా వేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం..  ఇప్పటి వరకు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయని నిందితులకు చివరి అవకాశం ఇచ్చింది. అభియోగాల నమోదుపై ఈ నెల 13న వాదనలకు సిద్ధం కావాలని వైవీ సుబ్బారెడ్డిని ఆదేశించింది.

మరోవైపు, జగన్‌మోహన్‌‌రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు మరింత సమయం కావాలని ప్రత్యేక కోర్టును సీబీఐ మరోమారు అభ్యర్థించింది. కాగా, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇందూ ప్రాజెక్టుల ప్రతినిధులు నిన్నటి విచారణకు హాజరు కాలేదు. అలాగే, ఓబుళాపురం గనుల కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా సీబీఐ గడువు కోరింది. దీంతో విచారణను కోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది.


More Telugu News