వైఎస్ రాజశేఖరరెడ్డి 60 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అభిమాని!
- చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వీరాభిమాని
- వైఎస్ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ
- తెలుగు రాష్ట్రాల్లో ఇదే అత్యంత ఎత్తయిన వైఎస్ఆర్ విగ్రహం
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వీరాభిమాని తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని పలమనేరులో 60 అడుగుల భారీ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం వైఎస్ఆర్ విగ్రహాల్లో ఇదే ఎత్తయినది కావడం విశేషం.
పలమనేరు సమీపంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ విగ్రహం ఏర్పాటు చేయడంపై రెండు రాష్ట్రాల్లోని వైఎస్ఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.