జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ కు కొత్త పాలకమండలి

  • అధ్యక్షుడిగా సీవీ రావు
  • కార్యదర్శిగా హనుమంతరావు ఎన్నిక
  • రెండేళ్ల పాటు కొనసాగనున్న కొత్త కార్యవర్గం
  • ఈ నెల 19న తొలి భేటీ
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ పాలక మండలి పదవులకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా సి.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షురాలిగా ఎ.హిమబిందు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా టి.హనుమంతరావు, సంయుక్త కార్యదర్శిగా ఎం.జనార్దన్ రెడ్డి ఎన్నికయ్యారు.

పాలకమండలి సభ్యులుగా అమితారెడ్డి, తిరుపతిరావు, రమేశ్ చౌదరి, కిలారు రాజేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, వెంకటసోమరాజు, అశోక్ రావు, శివప్రసాద్, జగ్గారావు, రవీంద్రనాథ్, సుభాష్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు టి.నరేంద్ర చౌదరి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.

ఈ నూతన పాలకమండలి రెండేళ్ల పాటు కొనసాగనుంది. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ నూతన కార్యవర్గం ఈ నెల 19న తొలిసారిగా భేటీ కానుంది.


More Telugu News