టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించిన బీసీసీఐ సెక్రటరీ జైషా

  • వచ్చే నెలలో ప్రారంభం కానున్న మెగా టోర్నీ
  • కరోనా కారణంగా యూఏఈకి వేదిక మార్పు
  • వచ్చే వారంలో భారత జట్టు ప్రకటన?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీ20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల అంటే అక్టోబరు 17 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నీ వేదికను భారత్ నుంచి యూఏఈకి మార్చిన సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని బీసీసీఐ సెక్రటరీ జైషా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూఏఈకి చెందిన హెచ్.ఇ. షేక్ నహన్యాన్ మబారక్ ఆల్ నహన్యాన్, ఖలీద్ ఆల్ జరూనీ తదితర ఐసీసీ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా జైషా వెల్లడించారు.

టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల వివరాలను సెప్టెంబరు 10లోగా సమర్పించాలని ఐసీసీ కోరింది. దీంతో భారత జట్టును ఈ నెల 6 లేదా 7 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్ రెండు దేశాలూ గ్రూప్-బిలోనే ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుండటంతో అభిమానులు టోర్నీతోపాటు ఈ మ్యాచ్ కోసం కూడా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.



More Telugu News