ఓ వృద్ధురాలి దయనీయ స్థితిని వీడియో రూపంలో పంచుకున్న చంద్రబాబు

  • ఏపీలో పెన్షన్లలో కోత పెడుతున్నారన్న చంద్రబాబు
  • ఇదీ ఆంధ్రప్రదేశ్ దుస్థితి అంటూ ట్వీట్
  • వీడియోలో తన గోడు వెళ్లబోసుకున్న వృద్ధురాలు
  • ఆమె కుటుంబ పరిస్థితిని వివరించిన స్థానికుడు
ఏపీలో పింఛన్లలో కోతలు పెడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఓవైపు బాదుడు, మరోవైపు అమానవీయ కోతలు అంటూ మండిపడ్డారు. ఇదీ ఆంధ్రప్రదేశ్ దుస్థితి అంటూ ట్విట్టర్ లో విమర్శించారు. ఈ మేరకు ఓ వృద్ధురాలి దయనీయ పరిస్థితిని వీడియో రూపంలో పంచుకున్నారు. తనకు తోబుట్టువులు, తండ్రి లేరని, తల్లి ఉన్నా ఆమె జీవచ్ఛవం వంటిదని ఓ వృద్ధురాలు ఆ వీడియోలో తన గోడు వెళ్లబోసుకుంది. తనకు పెన్షన్ ఇవ్వలేదని ఆమె వాపోయింది.

ఆమె పేరు తోరం సరస్వతి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలో నివసిస్తోంది. సరస్వతి వయసు 80 సంవత్సరాలు కాగా, ఆమె తల్లి వయసు 100 ఏళ్లు. ఆమె జీవించే ఉంది. అయితే, వీళ్లిద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉండడంతో వీళ్లలో ఒకరి పెన్షన్ తొలగిస్తామని అధికారులు అంటున్నట్టు ఓ స్థానికుడు తెలిపారు. అధికారులు వారిపట్ల దయ ఉంచి పెన్షన్ ను పునరుద్ధరించాలని ఆ తల్లీకూతుళ్ల తరఫున విజ్ఞప్తి చేశారు.


More Telugu News