కేరళలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పరీక్షలను వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • 11వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే
  • రోజుకు 35 వేల వరకు కరోనా కేసులు వస్తున్నాయన్న సుప్రీం
  • పిల్లలను ప్రమాదంలోకి నెట్టలేమని వ్యాఖ్య
కేరళలో వచ్చే వారం నుంచి జరగాల్సిన 11వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని... ఈ పరిస్థితుల్లో విద్యార్థులను ప్రమాదంలో పెట్టడం సరికాదని అన్నారు. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం కేరళలోనే నమోదవుతున్నాయని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

రోజుకు దాదాపు 35 వేల వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ప్రమాదంలోకి నెట్టలేమని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. నిన్న కూడా కేరళలో 32 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్న ఏకైక రాష్ట్రం కేరళనే కావడం గమనార్హం.


More Telugu News