ముగిసిన రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణ.. ఏడున్నర గంటలపాటు సాగిన విచారణ
- కెల్విన్ తో పరిచయంపై ఆరా
- ఎఫ్ క్లబ్ పార్టీపై ప్రశ్నలు
- 30 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టిన ఈడీ అధికారులు
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) చేపట్టిన విచారణ మూడో రోజు ముగిసింది. ఈరోజు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ అధికారులు విచారించారు. కాసేపటి క్రితం ఆమె విచారణ ముగిసింది. ఏడున్నర గంటలకు పైగా ఆమెను అధికారులు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా రకుల్ బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు.
మరోవైపు మధ్యాహ్నం రకుల్ కోసం అధికారులు లంచ్ ఏర్పాటు చేశారు. అయితే వారు తెప్పించిన భోజనాన్ని రకుల్ నిరాకరించింది. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఆమె భోజనం తెప్పించుకుంది. ఐదేళ్ల క్రితం ఎఫ్ క్లబ్ లో జరిగిన పార్టీపై ఈడీ ఫోకస్ చేస్తోంది. ఆ పార్టీకి రకుల్ కూడా హాజరయింది. ఇప్పుడు రకుల్ కు అదే సమస్యగా పరిణమించింది. ఆ పార్టీలో చాలా మందికి కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేశాడు. పార్టీ ఫుటేజ్ ఆధారంగా రకుల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా 30 ప్రశ్నలకు రకుల్ నుంచి ఈడీ అధికారులు సమాధానాలను రాబట్టారు. కెల్విన్ తో సంబంధాలు, ఎఫ్ క్లబ్ పార్టీపై ఆరా తీశారు. బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో ఉన్న సంబంధాలపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని ఆదేశించారు.