ఉమేశ్ యాదవ్ విజృంభణ... ఇంగ్లండ్ విలవిల

  • 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
  • ఉమేశ్ కు 3 వికెట్లు
  • కుప్పకూలిన ఇంగ్లండ్ టాపార్డర్
  • టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 191 ఆలౌట్
నాలుగో టెస్టులో బౌలర్ల హవా కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ కూడా బ్యాటింగ్ చేసేందుకు తడబడుతోంది. 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది.

టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు సాధించి ఇంగ్లండ్ టాపార్డర్ ను హడలెత్తించాడు. తొలిరోజు ఆటలో కీలకమైన ఇంగ్లండ్ సారథి జో రూట్ వికెట్ తీసిన ఉమేశ్... రెండో రోజు ఆటలోనూ నిప్పులు చెరిగాడు. క్రీజులో పాతుకుపోయిన డేవిడ్ మలాన్ (31)ను పెవిలియన్ చేర్చాడు. నైట్ వాచ్ మన్ గా బరిలో దిగిన క్రెగ్ ఒవెర్టన్ ను కూడా ఉమేశ్ అవుట్ చేసి టీమిండియా శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఈ ప్రదర్శనతో ఉమేశ్ టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 28 ఓవర్లలో 5 వికెట్లకు 76 పరుగులు. క్రీజులో ఓల్లీ పోప్, జానీ బెయిర్ స్టో ఉన్నారు.


More Telugu News