డ్రగ్స్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పూనం కౌర్
- డ్రగ్స్ అంటే కేవలం సెలబ్రిటీల సమస్య కాదన్న పూనం
- ఈ అంశంపై త్వరలోనే మాట్లాడతానని వ్యాఖ్య
- సొంత అనుభవాలను వెల్లడిస్తానన్న పూనం
టాలీవుడ్ లో డ్రగ్స్ అంశం మళ్లీ కలకలం రేపుతోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఈ కేసును విచారిస్తోంది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిలో రవితేజ, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, రానా, రకుల్ ప్రీత్ సింగ్, చార్మీ, పూరీ జగన్నాథ్, తనీశ్, ముమైత్ ఖాన్, నందు, తరుణ్ ఉన్నారు. పూరీ జగన్నాథ్, చార్మీ ఇప్పటికే విచారణను ఎదుర్కోగా... రకుల్ ప్రీత్ సింగ్ ఈరోజు విచారణకు హాజరయ్యారు. మరోవైపు డ్రగ్స్ అంశంపై సినీ నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'డ్రగ్స్ అంటే కేవలం సెలబ్రిటీల సమస్య కాదు. ఇది ప్రతి ఒక్కరి సమస్య. ఇది సరిహద్దు సమస్య. ఇది రాజకీయ అజెండాతో నడుస్తున్న సమస్య. ఇది సమాంతర బలమైన ఆర్థిక సమస్య. ఈ అంశంపై నేను మాట్లాడతాను. నా స్వీయ అనుభవాలను త్వరలోనే బయటపెడతాను' అని ఆమె ట్వీట్ చేశారు.