సంపద సృష్టించడం చేతకాక... ఆర్థికమంత్రి ఢిల్లీలో, సీఎం తాడేపల్లిలో కూర్చున్నారు: దేవినేని ఉమ
- వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తిన ఉమ
- లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపణ
- చేతులెత్తేశారంటూ ఎద్దేవా
- పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శలు
వైసీపీ ప్రభుత్వ పెద్దలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంపద సృష్టించడం చేతకాక లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ఆర్థికమంత్రి ఢిల్లీలో, సీఎం తాడేపల్లిలో కూర్చున్నారని విమర్శించారు. అసత్యాలు, పరిపాలనా వైఫల్యంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలు కాని హామీలు ఇచ్చి ఉద్యోగులను, పేదలను మోసం చేశారని మండిపడ్డారు. నవరత్నాలు అంటూ వంచించి, కనీసం పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.