ఎక్సైజ్​, రవాణా, మైనింగ్​, కార్మిక శాఖల్లో ఏపీ ప్రభుత్వం తనిఖీలు

  • నకిలీ చలాన్ల వ్యవహారంతో విచారణలు
  • డబ్బు ఎక్కడ జమైందన్న దానిపై ఆరా
  • రిజిస్ట్రేషన్ల శాఖ వ్యవహారంతో చర్యలు
రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలాన్ల వ్యవహారంతో మిగతా శాఖలపైనా ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. నకిలీ చలాన్లతో కొందరు అక్రమార్కులు రూ.8 కోట్లను దారి మళ్లించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అందులోని రూ.4 కోట్లను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 14 మంది సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

ఈ నేపథ్యంలోనే మిగతా శాఖల్లో చలాన్ల ద్వారా చేసే చెల్లింపులపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. చలాన్ల ద్వారా వచ్చే డబ్బు సీఎఫ్ఎంఎస్ లోనే జమవుతోందా? లేదా? అనే విషయాన్ని తేల్చేందుకు వివిధ శాఖల్లో తనిఖీలను చేస్తోంది. ఎక్సైజ్, మైనింగ్, రవాణా, కార్మిక శాఖల్లో అధికారులు విచారణ చేపట్టారు. అవకతవకలు జరిగినట్టు తేలితే సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నారు.


More Telugu News