ఏపీ పోలీసులకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట

  • రాష్ట్ర పోలీసులకు విశిష్ట గుర్తింపు
  • జాతీయస్థాయిలో 5 పురస్కారాలు
  • టెక్నాలజీ అంశంలో లభించిన అవార్డులు
  • తమపై మరింత బాధ్యత పెరిగిందన్న డీజీపీ
ఏపీ పోలీసులకు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో 5 అవార్డులు లభించాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. దాంతో ఏపీ పోలీసులకు ఈ రెండేళ్ల కాలంలో లభించిన అవార్డుల సంఖ్య 130కి దాటిందని తెలిపారు. తాజాగా లభించిన ఐదు అవార్డులు టెక్నాలజీ వినియోగం అంశంలో వచ్చాయని వివరించారు.

కృత్రిమ మేధ, పాస్ పోర్ట్ వెరిఫికేషన్, పోలీసు సిబ్బంది డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ నిర్వహణ తదితర అంశాల్లో ఏపీ పోలీసు విధానాలు దేశంలోనే అగ్రగామిగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యంగా, కరోనా సంక్షోభ సమయంలో రాష్ట్ర పోలీసుల పనితీరు సర్వత్రా ప్రశంసలు అందుకుందని అన్నారు. తాజా పురస్కారాలతో రాష్ట్ర పోలీసులపై మరింత బాధ్యత పెరిగిందని డీజీపీ తెలిపారు.


More Telugu News