పవన్ కల్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌పై పోలీస్ ఆఫీసర్ విమర్శలు!
- రామజోగయ్య సాహిత్యంపై డీసీపీ ఎం.రమేశ్ స్పందన
- తెలంగాణ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు అని వ్యాఖ్య
- పాటలో చెప్పినట్లు తాము బొక్కలు విరగ్గొట్టబోమని ట్వీట్
- తెలుగులో ఇంతకంటే మంచి పదాలు దొరకలేదా? అంటూ విమర్శ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ‘భీమ్లా నాయక్’ నుంచి టైటిల్ సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. యూట్యూబ్‌లో ఈ పాట మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీసుల పాత్రలో నటిస్తోన్న నేపథ్యంలో ఈ పాట లిరిక్స్ కూడా అందుకు తగ్గట్టుగా ఉన్నాయి.
అయితే, ఈ పాటలో పోలీసులని కించపరిచేలా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారని తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. 'ఖాకీ డ్రెస్సు పక్కన పెడితే వీడే పెద్ద గూండా... ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క... చెమడాలొలిచ్చే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క' అంటూ రామజోగయ్య రాసిన సాహిత్యంపై డీసీపీ (ఈస్ట్ జోన్, హైదరాబాద్) ఎం.రమేశ్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణ పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసులు అని ఆయన చెప్పారు. ప్రజల రక్షణ కోసమే తమకు జీతాలు ఇస్తున్నారని, తాము వారి బొక్కలు విరగ్గొట్టబోమని అన్నారు. పోలీసుల పరాక్రమాన్ని వర్ణించేందుకు గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రికి తెలుగులో ఇంతకంటే మంచి పదాలు దొరకలేదా? అంటూ విమర్శించారు. అలాగే, మరికొందరు నెటిజన్లు కూడా రామజోగయ్య శాస్త్రిపై విమర్శలు చేస్తున్నారు. మీ స్థాయికి తగ్గట్లు ఈ పాట లిరిక్స్ లేవంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై రామజోగయ్య శాస్త్రి స్పందిస్తూ.. 'మరోసారి రాసేటప్పుడు బాగా రాస్తా తమ్ముడు' అని రిప్లై ఇచ్చారు.