జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ
- అక్రమ కేసులు పెడుతోన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి
- నిరసనలు తెలిపితే గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు
- పోలీసులు ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘించారు
- వైసీపీ కార్యక్రమాల పట్ల పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో నిరసన తెలుపుతోన్న వారిపై పోలీసులు వ్యవహరిస్తోన్న తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. అక్రమ కేసులు పెడుతోన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనలు తెలిపితే గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.
పోలీసులు ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘించారని ఆయన అన్నారు. వైసీపీ వ్యవహారాలు, చర్యలపై మాత్రం పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.