తేజ చేయాల్సిన ఆ సినిమాలు ఆగిపోయాయట!

  • గోపీచంద్ తో సినిమా లేనట్టే 
  • రానాతో ప్రాజెక్టు ఆగిపోయినట్టే 
  • అభిరామ్ సినిమా పనుల్లో బిజీ 
  • త్వరలో రానున్న క్లారిటీ  
టాలీవుడ్ దర్శకులలో తేజ స్థానం ప్రత్యేకం. తాను అనుకున్న ఒక కథను మిగతా దర్శకులకు భిన్నంగా ఆయన చెబుతాడు. అంతే విలక్షణంగా సన్నివేశాలను తెరపై ఆవిష్కరిస్తాడు. అలాంటి తేజ .. గోపీచంద్ కథానాయకుడిగా 'అలమేలుమంగా - వెంకటరమణ' సినిమాను రూపొందిస్తున్నట్టుగా చెప్పాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుందని చెప్పుకున్నారు. కథనాయికగా అనుష్క .. సమంత .. కీర్తి సురేశ్ పేర్లు వినిపించాయి. కానీ ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించిన సమాచారం లేదు. ఇక రానా హీరోగా 'రాక్షసరాజు రావణుడు' అనే సినిమా రూపొందనున్నట్టు చెప్పారు. కానీ సినిమాకి సంబంధించిన అప్డేట్ ల జాడలేదు.

ఇంతకీ ఈ సినిమాలు ఉన్నాయా? ఆలస్యంగా పట్టాలెక్కనున్నాయా? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆగిపోయినట్టేనని చెప్పుకుంటున్నారు. రానా సోదరుడు అభిరామ్ హీరోగా చేసే సినిమా పనుల్లో తేజ ప్రస్తుతం ఉన్నాడని అంటున్నారు. మరి ఈ విషయంలో ఆయన నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి.  


More Telugu News