మరో యంగ్ హీరో కోసం ట్రై చేస్తున్న బుచ్చిబాబు!

  • 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయం
  • తొలి ప్రయత్నంలోనే పడిన హిట్
  • దొరకని స్టార్ హీరోల డేట్లు
బుచ్చిబాబు పేరు వినగానే అందరికీ 'ఉప్పెన' హిట్ సినిమా గుర్తుకు వస్తుంది. దర్శకుడిగా బుచ్చిబాబుకి ఇది తొలి సినిమా .. అయినా ఎక్కడా కూడా ఇది ఆయన ఫస్టు సినిమా కదా సర్దుకుపోదామని అనిపించదు. ఇక హీరో .. హీరోయిన్లకు కూడా ఇది తొలి సినిమానే. అయినా వాళ్ల నటనలో తడబాటు ఎక్కడా కనిపించదు.

అంత పర్ఫెక్ట్ గా ఆయన ఈ సినిమాను తెరకెక్కించాడు. అలాంటి ఆయన ఇంతవరకూ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించకపోవడం విశేషం. 'ఉప్పెన' సినిమా సాధించిన సంచలన విజయాన్ని చూసిన తరువాత, ఏకంగా ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత వైష్ణవ్ తేజ్ హీరోగానే మరో సినిమాను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కానీ వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలు ఒప్పుకోవడం వలన, డేట్లు కుదరలేదనే టాక్ వినిపించింది. దాంతో మరో యంగ్ హీరోతో సినిమా చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. మరి ఆ యంగ్ హీరో ఎవరో .. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందనేది చూడాలి.  


More Telugu News