తెలంగాణలో నేడు, రేపు కూడా వర్షాలు
- నేడు తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు
- రేపు భారీ వర్షాలకు అవకాశం
- గత రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం
తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. నేడు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని, రేపు (శనివారం) భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది.
ఇక నిన్న ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి (కె)లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, హైదరాబాద్‌లో గత రాత్రి ఏడున్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వానకు జనజీవనం స్తంభించి పోయింది. మూడు గంటల్లోనే ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.