నాలుగో టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 191 ఆలౌట్

  • లండన్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • ప్రారంభమైన నాలుగోటెస్టు
  • టాస్ గెలిచిన ఇంగ్లండ్
  • టీమిండియా మొదట బ్యాటింగ్
  • వోక్స్ కు 4 వికెట్లు
  • మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శార్దూల్
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా టాపార్డర్ మరోసారి తడబడింది. లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ లో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 191 పరుగులకు ఆలౌటైంది. ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న శార్దూల్ ఠాకూర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఠాకూర్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ప్రధాన బ్యాట్స్ మెన్ విఫలమైన చోట ఠాకూర్ ఇంగ్లండ్ బౌలర్లను దూకుడుగా ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4, ఓల్లీ రాబిన్సన్ 3 వికెట్లు తీశారు.

అంతకుముందు కెప్టెన్ కోహ్లీ (50) పరుగులు సాధించాడు. కాగా, ఈ ఇన్నింగ్స్ తో కోహ్లీ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా 23 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా అవతరించాడు. సచిన్ కు ఈ ఘనత నమోదు చేసే క్రమంలో 522 ఇన్నింగ్స్ లు ఆడగా, కోహ్లీ 490 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డు నెలకొల్పాడు.


More Telugu News