రాఫెల్ భారత్ లో ఎప్పుడో ల్యాండయింది... రాహుల్ గాంధీనే టేకాఫ్ తీసుకోలేకపోతున్నారు: రాజ్ నాథ్

  • పెట్రో ధరలపై కేంద్రాన్ని నిలదీసిన రాహుల్
  • రాహుల్ పై రాజ్ నాథ్ వ్యంగ్యం
  • ఎగరడానికి తంటాలు పడుతున్నారని ఎద్దేవా
  • రాహుల్ మాటలు పట్టించుకోనవసరం లేదని వ్యాఖ్య  
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు సంధించారు. పెట్రో ధరల పెంపుపై కేంద్రంపై రాహుల్ భగ్గుమన్న మరుసటిరోజే రాజ్ నాథ్ స్పందించారు. పాపం, రాహుల్ గాంధీ టేకాఫ్ తీసుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

"కాంగ్రెస్, రాహుల్ గాంధీ గతంలో రాఫెల్ విమానాలపై అనవసర రాద్ధాంతం చేశారు. దానివల్ల వారికి ఏం ఒరిగింది? ఫ్రాన్స్ లో రాఫెల్ తయారైంది... భారత్ లోనూ ల్యాండయింది. కానీ రాహుల్ గారు మాత్రం ఇంకా టేకాఫ్ తీసుకోవడానికి తంటాలు పడుతూనే ఉన్నారు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

అసలు, రాహుల్ గాంధీ వంటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలపై ఎక్కువగా స్పందించడం అనవసరం అని, సమయంతో పాటు శక్తి కూడా వృథా అని రాజ్ నాథ్ అభిప్రాయపడ్డారు. రాజకీయవేత్తగా ప్రత్యర్థులను గౌరవించాల్సిన అవసరం ఉందని, కానీ రాహుల్ వంటి వారిపై పరిమితంగానే స్పందించాలని పేర్కొన్నారు.


More Telugu News