నాలుగో టెస్టులోనూ టీమిండియాకు కష్టాలే... 122 పరుగులకే 6 వికెట్లు డౌన్
- లండన్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు
- మరోసారి విఫలమైన టీమిండియా టాపార్డర్
- కోహ్లీ అర్ధసెంచరీ
లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్... తొలిరోజు ఆటలో టీ విరామానికి 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (50) అర్ధసెంచరీ సాధించడంతో ఆమాత్రం స్కోరైనా వచ్చింది.
రోహిత్ శర్మ (11), కేఎల్ రాహుల్ (17), పుజారా (4), జడేజా (10), రహానే (14) విఫలమయ్యారు. ప్రస్తుతం రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ఓల్లీ రాబిన్సన్ చెరో రెండు వికెట్లు తీయగా, జేమ్స్ ఆండర్సన్, క్రెగ్ ఓవెర్టన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.