ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింపు
- ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
- సీఎంకు గణాంకాలు వివరించిన అధికారులు
- రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ
రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తెలిపిన వివరాలను పరిశీలించిన ఆయన రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించాలని నిర్దేశించారు. కర్ఫ్యూ ఎత్తివేతకు మరికొంతకాలం వేచిచూద్దామని పేర్కొన్నారు.
వినాయకచవితి ఉత్సవాలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించరాదని, చవితి ఉత్సవాలను ఇళ్లకు పరిమితం చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనాలు, ఊరేగింపులను అనుమతించరాదని స్పష్టం చేశారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.