ఈదుకుంటూ పడవ వరకూ వచ్చేసిన పాము.. వీడియో వైరల్!
- రికార్డు చేసిన ఆస్ట్రేలియన్ యూట్యూబర్ బ్రాడీ మోస్
- చిన్నపడవలో సముద్రంలోకి వెళ్తే వెంబడించిన పాము
- ఈ టైంలో జత కోసం వెతుకుతూ చిరాకుగా ఉంటాయన్న బ్రాడీ
- వీడియో చూసి, రకరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు
ఏదైనా పాము మన వెంటపడితే ఏం చేస్తాం? భయంతో బిక్కచచ్చిపోతాం. కానీ ఈ యూట్యూబర్ మాత్రం తన వెంట పడిన పామును వీడియో తీశాడు. పడవేసుకొని సముద్రంలోకి వెళ్లిన సమయంలో నీటి నుంచి బయటకు వచ్చిన ఈ పాము.. అతని వెంట పడింది. ఒక్క క్షణం ఆ పడవపై తల పెట్టి, మళ్లీ ఏమనుకుందో ఏమో? వెనుతిరిగి వెళ్లిపోయింది. ఆ తర్వాత నీటిలోపలకు వెళ్లి మాయమైంది.
టిక్‌టాక్‌లో బ్రాడీ మోస్ అనే యూట్యూబర్ షేర్ చేసిన ఈ వీడియో ఇతర సోషల్ మీడియా వేదికలకు కూడా పాకింది. సాధారణంగా నీటి పాములు మనుషుల జోలికి రావని ఈ వీడియోలో బ్రాడీ చెప్పడం వినిపిస్తుంది. కానీ ఏడాదిలో ఈ సమయంలో మాత్రం అవి జత కోసం వెతుకులాడుతూ ఉంటాయట. చాలా చిరాకు పడుతూ ఉండటంతోనే అది తనను వెంబడించిందని బ్రాడీ వివరించాడు. ట్విట్టర్‌లో కూడా ఈ వీడియో బాగా వైరల్ అయింది.
ఈ ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆస్ట్రేలియన్లకు ఇలాంటి ప్రమాదకరమైన జీవులను చూడటం అలవాటైపోయిందని కొందరు అంటుంటే.. అసలు పాములు ఈదుతూ కనిపిస్తేనే తను కుదురుగా కూర్చోలేనని మరొకరంటున్నారు. ఇలాంటి సముద్రపు పాములు నీటి లోపల 250 అడుగుల లోతుకు వెళ్లి కనీసం 8 గంటలు గడిపేస్తాయట. ఇప్పటి వరకూ గుర్తించిన నీటి పాముల్లో అత్యథిక శాతం చాలా విషపూరితమైనవే కావడం గమనార్హం.